కాలు నుండి రక్తం కారుతుంటే.. స్వయంగా ఆయనే ఆ షాట్ చేశారు

కాలు నుండి రక్తం కారుతుంటే.. స్వయంగా ఆయనే ఆ షాట్ చేశారు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో స్కంద(Skanda) సినిమాపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇటీవలే ఆ సినిమా ఓటీటీలో రిలీజయ్యింది. థియేటర్స్ లో నెగిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా చుసిన నెటిజన్స్ మాత్రం ఒక విషయంలో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) ను విమర్శిస్తున్నారు. స్కంద మూవీ ఒక యాక్షన్ సన్నివేశంలో రామ్ కు బదులు బోయపాటి స్వయంగా నటించారు. థియేటర్ లో ఆ విషయాన్ని ఎవరు గమనించలేదు కానీ.. ఓటీటీలో వచ్చాక ఆ విషయాన్ని గుర్తించి.. స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఏంటి బోయపాటి ఇది అంటూ కామెంట్స్ చేశారు.

ఇక ఈ ట్రోల్స్ రామ్(Ram pothineni) వద్దకు చేరడంతో తాజాగా ఆయన స్పందించారు. ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.. అది 22.04.2023 నాకు ఇంకా గుర్తుంది. సమ్మర్‌లో భీబత్సమైనా ఎండగా ఉన్న రోజులవి. యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో నా కాళ్ళు కోసుకుపోయి దారుణంగా అయింది. కాలు నుండి రక్తం కారుతూ నేను షూటింగ్‌ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు.. బోయపాటిగారు స్వయంగా ఆ సీన్ లో యాక్ట్ చేశారు. ఫైనల్ గా సినిమా రిజల్ట్ అనేది ఆడియన్స్‌కు చేతిలో ఉంది కానీ.. నేను మాత్రం మీ అభిప్రాయాలను గౌరవిస్తాను.. గౌరవిస్తూనే ఉంటాను. నా కోసం స్కంధలో ఈ షాట్‌ చేసినందుకు మా దర్శకుడికి కృతజ్ఞతలు.. అని రాసుకొచ్చారు రామ్. ప్రస్తుతం రామ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO  READ : ఊహించని కలెక్షన్స్తో.. మా ఊరి పొలిమేర 2