
సరికొత్త కాన్సెప్టుల్ని సెలెక్ట్ చేసుకుంటూ డిఫరెంట్ దారిలో వెళ్తున్నాడు శ్రీవిష్ణు. కొద్ది రోజుల క్రితమే ‘రాజరాజ చోర’ అంటూ దొంగ పాత్రలో మెప్పించాడు. త్వరలో ‘అర్జున ఫల్గుణ’ అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తేజ మార్ని డైరెక్ట్ చేసిన ఈ మూవీని న్యూ ఇయర్ గిఫ్ట్‌గా డిసెంబర్ 31న విడుదల చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. ‘సమరానికి సిద్ధం.. డిసెంబర్ 31న థియేటర్స్‌లో కలుద్దాం’ అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ పూర్తయ్యింది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ లాంటి వాటిని చూస్తే శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తున్నాడనే నమ్మకం కలుగుతోంది. తనకి జోడీగా అమృతా అయ్యర్ నటించింది. నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. పి.సుధీర్ వర్మ మాటలు, ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.