"అల్లూరి" జయంతిన టీజర్ రావడం నా అదృష్టం

"అల్లూరి" జయంతిన టీజర్ రావడం నా అదృష్టం
  • "అల్లూరి" జయంతిన టీజర్ రావడం నా అదృష్టం
  • అల్లూరి టీజర్: విప్లవానికి నాందీ...నిజాయితీకి మారుపేరు

ప్రదీప్ వర్మ డైరెక్షన్ లో శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా అల్లూరి.  ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు యూనిట్ తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా "అల్లూరి" టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. నిమిషం 21 సెకన్లున్న ఈ సినిమా టీజర్ ప్రారంభంలోనే హీరో పోలీస్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. మహాత్మాగాంధీ ఫొటో చూపిస్తూ ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ పోలీస్ బయలుదేరాడురా అనే డైలాగ్ ఉంటుంది. విప్లవానికి నాందీ చైతన్యం.. చైతన్యానికి పునాది నిజాయితీ..నిజాయితీకి మారుపేరు అల్లూరి అనే డైలాగ్స్ బాగున్నాయి. శ్రీవిష్ణు యాక్షన్ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఇటీవల రిలీజైన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పంద‌న వచ్చిందంటున్నారు. అల్లూరి సినిమాకు ..నిజాయితీకి మారుపేరు అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ హీరో పాత్రని సూచించేలా ఉంది.

ఈ పాత్ర కోసం పూర్తిగా ట్రాన్సఫర్మేషన్ అయిన శ్రీవిష్ణు పోలీస్ యూనిఫాంలో చేతిలో తుపాకీని పట్టుకుని డాషింగ్ గా కనిపించారు. వర్షంలో చేతిలో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో నడుస్తూ రావడం స్టన్నింగా ఉంది. సిన్సియర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న అల్లూరి ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ ఉంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందని సినిమా యూనిట్ తెలిపింది. టీజర్ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అల్లూరి 125వ జయంతిన నా సినిమా టీజర్ రిలీజ్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. అల్లూరి సీతారామరాజును చూడలేదుగానీ.. ఆయన పేరు పెట్టుకున్న ఈ సినిమాలో సిన్సియర్ గా నటించా అన్నారు. ఇంతవరకు చేసిన పాత్రలు వేరు.. ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. సమాజానికి ఇలాంటి కథ కావాలని.. త్వరలోనే సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నామని అందరూ ఆశీర్వదించాలన్నారు.