
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోలలో శ్రీ విష్ణు(Sri Vishnu) ఒకరు. ఆయన తన ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సామజవరగమన(Samajavaragamana) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ అబ్బరాజు(Ram abbaraju) తెరెకెక్కించిన ఈ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు హీరో శ్రీ విష్ణు.
అయితే చాల కాలం నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ విష్ణుకు పర్ఫెక్ట్ టైంలో సాలిడ్ హిట్ పడింది. దీంతో కెరీర్ ఎన్నడూ లేనంత హ్యాపిగా ఉన్నారు ఈ హీరో. ఇక ఈ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా రేటు పెంచేశారు శ్రీ విష్ణు. ఈ సినిమాకు ముందు వరకు రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేసిన ఈ హీరో.. సామజవరగమన హిట్ తరువాత నాలుగు నుండి ఐదు కోట్లకు రెమ్యునరేషన్ పెంచేశారు. దీనికి కారణం శ్రీ విష్ణుతో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడమే.
సామజవరగమన హిట్ తరువాత శ్రీ విష్ణుకి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ హీరో తన తరువాతి సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్(Geetha arts) లో చేయనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం శ్రీ విష్ణు ఏకంగా ఐదు కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. మరి ఈ సినిమా కూడా సక్సెస్ అయితే.. శ్రీ విష్ణు తన రెమ్యునరేషన్ ను డబుల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకట రావాల్సి ఉంది.