హీరో సూర్య ఎమోషనల్ నోట్: నా ఫ్రెండ్ మరణంతో నా గుండె బరువెక్కి పోయింది

హీరో సూర్య ఎమోషనల్ నోట్:  నా  ఫ్రెండ్  మరణంతో నా గుండె బరువెక్కి పోయింది

మలయాళ రైటర్, డైరెక్టర్ సిద్ధిఖీ( Siddique)  రీసెంట్(ఆగస్టు 8న) చనిపోయిన విషయం తెలిసిందే. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లివర్ సమస్యతో పాటు నిమోనియాతో పోరాడి.. గుండెపోటుతో సిద్దిఖీ చనిపోగా..ఇండస్ట్రీ నుంచి సినీ సెలెబ్రెటీలు విచారం తెలుపారు. లేటెస్ట్ గా హీరో సూర్య(Suriya)  డైరెక్టర్ సిద్ధిఖీ పై ఒక ఎమోషనల్ నోట్ ను రిలీజ్ చేశారు. 

డైరెక్టర్, ఫ్రెండ్ సిద్దిక్ మరణంతో నా గుండె బరువెక్కి పోయింది. నాటి రోజులన్నీ నా మనసులో మెదులుతున్నాయి. సిద్దిక్ ఫ్యామిలీ మెంబర్స్ కు  నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి కష్టతర సమయంలో మీ అందరికీ నేను అండగా ఉంటాను. సిద్ధిక్ సెట్ లో అందరినీ సమానంగా చేసేవారు.. ఎవ్వరిపై అరవడం, కోప్పడటం నేను చూడలేదు. ఆయన వల్లే షూటింగ్ సెట్‌లో ఎక్కువ సేపు ఉండాలని అనుకునేవాడిని.

ఇక ఆయనతో ఉన్నంత సేపు ఎంతో నవ్వించేవారు. సినిమా జర్నీని ఎంజాయ్ చేయాలి అనేది ఆయన వద్దనే నేర్చుకున్నాను. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది నేను ఎప్పటికీ ఆరాధించే అనుభవం, నేను అతనిని కలవడానికి ముందు నాకు లేని కొత్త ఆలోచనలని, ధైర్యాన్ని ఇచ్చారు. యాక్టర్ గా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు.. నాపై మీ విశ్వాసం, నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను..అంటూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు సూర్య. 

తమిళంలో వచ్చిన  ఫ్రెండ్స్  సినిమాలో విజయ్, సూర్యలు హీరోలుగా నటించారు. ఈ మూవీకి సిద్ధిక్ డైరెక్ట్ చేశారు.ఇక అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది.  

సూర్య, విజయ్‌ నటించిన ఫ్రెండ్స్‌, విజయ్‌ నటించిన కావలన్‌ విజయకాంత్‌ నటించిన ఎంగల్‌ అన్నా, అరవింద్‌ స్వామి, అమలా పాల్‌ జంటగా నటించిన  భాస్కర్‌ ఒరు రాస్కల్‌, బాడీ గార్డ్, బిగ్ బ్రదర్,  చిత్రాలకు సిద్ధిక్‌ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అలాగే  సిద్దిక్ తమిళంలో డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీస్ లో చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి.