ఫస్ట్ టైం అలా నటించా..కామెడీ అంటేనే క్రేజీ ఫీలింగ్

ఫస్ట్ టైం అలా నటించా..కామెడీ అంటేనే క్రేజీ ఫీలింగ్

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా నిర్మాతలకు కాసుల పంట పండించిన సినిమా ఎఫ్2. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మూవీ 27న రీలీజ్ కానుంది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ U సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు హీరో వెంకటేష్.

కామెడీ పాత్రలే సంతృప్తినిస్తాయి 

కామెడీ మూవీ అనగానే తనకొక క్రేజీ ఫీలింగ్ ఉంటుందన్నారు వెంకీ. ఇంట్లో, ఫ్రెండ్స్ తో సహా అందరితో సరదాగా ఉంటాను..అందుకే చాలా మంది తనను కామెడీ యాంగిల్ లోనే చూడాలనుకుంటారని చెప్పారు. అదేవిధంగా తన బాడీ లాంగ్వేజ్ కూడా కామెడీ మూవీకి కన్వీనియెంట్‌గా ఉంటుందన్నారు. పైగా ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలే మంచి పేరు తెచ్చిపెట్టినట్లు చెప్పారు. అంతేకాకుండా అలాంటి  పాత్రలే తనకు సంతృప్తినిస్తాయన్నారు వెంకీ. 

ఎఫ్3 నాన్స్టాప్ ఎంటర్టైనర్

నారప్ప, దృశ్యం 2 లాంటి సీరియస్ సబ్జెక్స్ తర్వాత కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఎఫ్3 నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ అని..ఇలాంటి మూవీస్ చూస్తే ప్రేక్షకులకు కిక్ వస్తుందని తెలిపారు. మసాలా మూవీకి రైటర్ గా పని చేసినప్పటి నుండి తనకు అనిల్‌తో పరిచయం ఉందన్నారు వెంకటేష్. ఈవీవీ సత్యనారాయణ, శ్రీను వైట్ల లాంటి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ అనిల్ అని కితాబిచ్చారు. అందరి దగ్గరి నుంచి నేచురల్ పర్ఫార్మెన్స్ రాబట్టుకుంటాడని చెప్పారు. ఇంకా తన కో బ్రదర్ గా వరుణ్ తేజ్ ఎఫ్‌ 2లోనే అదరగొట్టేశాడని...ఇందులో తమ కాంబినేషన్ మరింత అలరిస్తుందన్నారు. అప్పుడు రిలేషన్ షిప్ ఫ్రస్టేషన్ తో నవ్వులు పూయించామన్న వెంకీ..ఇప్పుడు ట్రీట్మెంట్ మార్చి మరింత ఫన్ తో వస్తున్నట్లు తెలిపారు.


 
ఫస్ట్ టైం రేచీకటి ఉన్న వ్యక్తిగా నటించా

ఇందులో కూడా వెంకీ ఆసనం ఉందని చెప్పారు వెంకటేష్. ఎఫ్ 2 తర్వాత అది బాగా వైరల్ అయ్యిందని..నాలుగేళ్ల పిల్లలు కూడా ఇమిటేట్ చేయడం చూసి ఆశ్చర్యపోతుంటానని చెప్పారు. పిల్లల్ని కూడా ఎంటర్‌‌టైన్ చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. డబ్బు కోసం అత్యాశ పడటం మనిషి లక్షణం. దాని చుట్టూనే ఈ కథంతా తిరుగుతుందని తెలిపారు. మొదటిసారి ఈ మూవీలో రేచీకటి ఉన్న వ్యక్తిగా నటించినట్లు చెప్పారు.చాలా రోజుల తర్వాత ఇంతమందితో కలిసి పని చేయడం సరదాగా అనిపించిందన్నారు. 

మనకు రావాలని ఉంటే అదే వస్తుంది

కేజీఎఫ్ లాంటి సినిమాలు చేయాలని అనుకుంటాం...కానీ అలాంటివి వస్తే బాగుంటుంది, లేదంటే లేదు అనుకోవాలి తప్ప అతిగా ఆలోచించకూడదన్నారు. ఏదైనా మనకు రావాలని ఉంటే అదే వస్తుంది..డబ్బు కూడా మనకు ఎంత అవసరం ఉందో అంతే మన దగ్గరకు వస్తుందని చెప్పారు. వచ్చినదాంతో జీవితాన్ని లీడ్ చేయాలని..అయితే హార్డ్ వర్క్ మాత్రం ఎప్పుడూ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక కొవిడ్ సమయంలో వెబ్ సిరీస్ చేద్దామని రానా అడిగాడు. ఖాళీగానే ఉన్నాం కదా అని సరే అన్నాను. చాలా డిఫరెంట్ సిరీస్. నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాను. ఈ వారంలో షూటింగ్ కూడా అయిపోతుంది. నాలుగైదు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. ఇయర్ ఎండింగ్లో నెట్ ఫ్లిక్స్ లో ఆ మూవీ స్ట్రీమ్ అవుతుందని చెప్పారు.

స్క్రిప్ట్ వస్తే నాన్న బయోపిక్ చేయడానికి సిద్ధం

మంచి కథలు దొరికితే ఎవరితోనైనా వర్క్ చేయడానికి రెడీ అన్నారు వెంకటేష్. సల్మాన్ ఖాన్ సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తున్నట్లు తెలిపిన ఆయన..నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్టవుతుందన్నారు. సితార, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ లో సినిమాలు చేయాల్సి ఉందన్నారు. స్క్రిప్ట్ వస్తే తన తండ్రి బయోపిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెంకీ ప్రకటించారు. వివేకానంద బయోపిక్ కూడా చేయాలనుకున్నాను కానీ కుదరడం లేదన్నారు. ప్యాన్ ఇండియా సినిమాల గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పారు. అదేవిధంగా మా అబ్బాయి లాంచింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు..కానీ నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదని వెంకటేష్ తెలిపారు. రెండున్నరేళ్లలో కోవిడ్ రాకుండా జాగ్రత్తపడ్డాను. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్నీ ఇప్పటికీ పాటిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

తెలంగాణ రైతుల కడుపు నింపి ఇతర రాష్ట్రాలకు వెళ్లు

ఇండియాకు పాప్ సింగర్..