ఇండియాకు పాప్ సింగర్..

ఇండియాకు పాప్ సింగర్..

టినేజ్లోనే తన పాటలతో పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కెనడాకు చెందిన  సింగర్ జస్టిన బీబర్...త్వరలో భారత్కు రానున్నాడు. వరల్డ్ టూర్లో భాగంగా అక్టోబర్ 18న ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. జస్టిన్ టూర్ ఇండియా టూర్కు సంబంధించిన విషయాన్ని ప్రముఖ ఆన్ లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షో వెల్లడించింది. జూన్ 2న ప్రీ సేల్ ఉంటుందని...జూన్ 4 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఒక్కో టికెట్ ధర రూ. 4వేల నుంచి మొదలవుతుందని వెల్లడించింది. బీబర్ భారత్ పర్యటనకు వస్తున్నాడన్న వార్త తెలిసి..అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఓ బేబీ.. బేబీ..' అంటూ అభిమానులను ఉర్రూతలూగించిన పాప్‌స్టార్‌ జస్టిన్‌ బీబర్‌...'సారీ', 'లవ్‌ యువర్‌ సెల్ఫ్‌', 'ఘోస్ట్​' వంటి సాంగ్స్ తో  కోట్లాది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఇక ప్రపంచ టూర్​లో భాగంగా బీబర్​ 30 దేశాల్లో 125కుపైగా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నెల మెక్సికోలో ప్రారంభమైన ఈ పర్యటన.. వచ్చే ఏడాది 2023 మార్చి వరకు కొనసాగనుంది.

2017లో తొలిసారి భారత పర్యటన...
2017లోనూ ఇండియాలో జస్టిన్ పర్యటించాడు.  ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో షో ఇచ్చాడు.  120 మందితో తన షోను నిర్వహించాడు.