విచిత్ర కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి విజయ్ కాంత్?

విచిత్ర కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి విజయ్ కాంత్?

తమిళ నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి మరో తమిళ స్టార్ హీరో పేరు చేరింది. ఆ హీరో మరెవరో కాదు విజయ్ కాంత్. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఉన్న ఆమె.. తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరిస్తూ.. ఓ తెలుగు సినిమా షూటింగ్ సమయంలో ఆ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన కామెంట్స్ చేశారు. ఆ విషయం గురించి తమిళ నడిగర్ సంగంలో ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోలేదని ఆమె వివరించారు. 

దాంతో ఈ వివాదంలోకి సీనియర్ హీరో విజయ్ కాంత్ పేరు చేరింది. కారణం.. విచిత్ర నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసిన సమయంలో విజయ్ కాంత్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో తానూ చేసిన ఫిర్యాదును ఆయన సీరియస్ గా తీసుకోలేదని, తన దగ్గరకు ఎందుకు వచ్చారు, పోలీసుల దగ్గరకు వెళ్లాల్సిందని మండిపడ్డారని ఆమె అన్నారు. ఆ విషయాన్నీ అంతటితో మర్చిపోయే వెళ్లి పనిచేసుకోమని సూచించారట. దీంతో ఈ వివాదంలో విజయ్ కాంత్ పేరు కూడా సంచలనంగా మారింది. అయితే ఈ విషయంలో విజయ్ కాంత్ పేరును ఎక్కడ ప్రస్తావించలేదు విచిత్ర కానీ.. ఆ సమయంలో ఆయన అధ్యక్షడిగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నేషనల్ వైడ్ ట్రేండింగ్ గా మారింది. మరి ఈ రెండు విషయాలపై అటు బాలకృష్ణ గానీ.. ఇటు విజయ్ కాంత్ గానీ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Also Read :- డంకీ మూవీ కోసం షాకింగ్ బడ్జెట్.. ఇంతకీ ఇది షారుఖ్ సినిమానేనా?