హీరో విశ్వక్ సేన్‌‌‌‌‌‌‌‌ ప్రాంక్ వీడియో దుమారం

హీరో విశ్వక్ సేన్‌‌‌‌‌‌‌‌ ప్రాంక్ వీడియో దుమారం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు షూట్ చేసిన హీరో విశ్వక్ సేన్, అతడి యూనిట్ పై న్యాయవాది అరుణ్ కుమార్ సోమవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆదివారం విశ్వక్ ఒక ప్రాంక్ వీడియో షూట్ చేసిన సంగతి తెలిసిందే. తన కారు ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు విశ్వక్ సీన్ క్రియేట్ చేసి షూట్ చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఓ సినిమా పబ్లిసిటీ కోసం ప్రజలను భయాందోళనకు గురి చేసి, న్యూసెన్స్ చేసిన వారిపై చర్యలకు ఆదేశించాలని హెచ్ఆర్సీని లాయర్ కోరారు. ఇలాంటి వీడియోలు యువతపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

మరిన్ని  వార్తల కోసం...

మానవత్వానికి మహోన్నత ద్వారం ‘రమజాన్​’

ఇంటర్ లో ‘నిమిషం’ నిబంధన