Aaditi Pohankar: ఆడియన్స్ని కట్టిపడేస్తోన్న ఆశ్రమ్’ బ్యూటీ ఆదితి.. వరుస సినిమాలు, సిరీస్లతో ట్రెండింగ్లో..

Aaditi Pohankar: ఆడియన్స్ని కట్టిపడేస్తోన్న ఆశ్రమ్’ బ్యూటీ ఆదితి.. వరుస సినిమాలు, సిరీస్లతో ట్రెండింగ్లో..

కొన్ని కథల్లో క్యారెక్టర్స్ పుట్టుక నుంచి చూపిస్తే.. మరికొన్ని స్కూల్​ ఏజ్ నుంచి మొదలవుతాయి. అయితే ఇలా చదువుకునే రోజుల నుంచి ఏదైనా సాధించేవరకు తీసే సినిమాల్లో ఏజ్ డిఫరెన్స్​ కనిపించాలని ఒకే క్యారెక్టర్​కి ఇద్దరు యాక్టర్స్​ని తీసుకుంటారు. కానీ, కొంతమంది యాక్టర్స్ మాత్రం రెండు లుక్స్​ల్లోనూ బాగుంటారు. దాంతో ఆ రోల్​ మొదటి నుంచి చివరిదాకా ఒకరే కంటిన్యూ చేస్తారు. కేవలం గెటప్స్ చేంజ్​ చేస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టే యాక్టింగ్ కూడా ఉండాలి. అప్పుడే చూసే ఆడియెన్స్​కు నచ్చుతుంది. ఇలాంటి కథల్లో వరుసగా నటిస్తూ తన పర్ఫార్మెన్స్​తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది ఈ బాలీవుడ్​ బ్యూటీ. తన పేరే ఆదితి పొహంకర్ (Aaditi Pohankar). లేటెస్ట్​గా ‘జిద్దీ ఇష్క్’ అనే సిరీస్​లో నటించింది. 

ఆదితి.. అమ్మానాన్నలు సుధీర్, శోభ. వాళ్లిద్దరూ అథ్లెట్స్ కావడంతో ఆదితి కూడా అథ్లెటిక్స్ నేర్చుకుంది. స్కూల్​ డేస్​లో మహారాష్ట్రలో జరిగిన అథ్లెటిక్స్​ పోటీల్లో మెడల్స్ గెలుచుకుంది. 2010లో ‘లవ్​ సెక్స్ ఔర్ ధోఖా’ అనే ఆంథాలజీ ఫిల్మ్​లో మైనర్​ పాత్ర పోషించింది. తర్వాత మరాఠీలో వచ్చిన ‘కునసాథి కునితారి’ సినిమాలో ఒక పాత్ర చేసింది. ఒకసారి ముంబైలో టైమ్​ బాయ్ అనే నాటకంలో ఏడేండ్ల పిల్లాడిలా ఆమె నటించింది. అందులో ఆమె పర్ఫార్మెన్స్​ చూసిన డైరెక్టర్ నిషాంత్ కామత్​ ‘లాయి భారి’ (2014)  అనే మరాఠీ ఫిల్మ్​లో ఒక రోల్​ కోసం స్క్రీన్​ టెస్ట్ చేశాడు.

ఆమె యాక్టింగ్ నచ్చడంతో ఆ సినిమాలో రితేశ్ దేశ్​ముఖ్​తో స్క్రీన్​ షేర్ చేసుకునే చాన్స్ వచ్చింది. ఆ సినిమా మరాఠీ ఫిల్మ్స్​లోనే అప్పట్లో హయ్యెస్ట్​ కలెక్షన్స్​ సాధించడంతో ఆదితికి మంచిపేరు వచ్చింది. 2017లో ఆదితి తమిళంలో ‘జెమినీ గణేశనమ్​ సురుళి రాజానమ్’ అనే సినిమాలో నటించింది. మూడేండ్ల తర్వాత ‘షి’  అనే సిరీస్​లో పోలీస్ కానిస్టేబుల్​గా నటించింది. తర్వాత మరాఠీలో ‘ట్రక్​భర్ స్వప్న’, తమిళంలో ‘స్టార్’​ అనే మూవీస్​ చేసింది. అలాగే బాబీ డియోల్ నటించిన ‘ఏక్ బద్నామ్ ఆశ్రమ్’ వెబ్ సిరీస్, ‘మండల మర్డర్స్’ వంటి సిరీస్​ల్లోనూ కనిపించింది. వరుస ప్రాజెక్ట్స్​తో బిజీగా ఉన్న ఆదితి ఆయా సందర్భాల్లో తన గురించి పంచుకున్న విశేషాలు ఇవి. 

అమ్మ కల

నేను అథ్లెటిక్స్ నేర్చుకుంటున్న టైంలో మా నాన్న ఎప్పుడూ ఒకటి చెప్పేవారు. నీకంటూ ఏదైనా కల ఉంటే కదా దాన్ని సాధించగలవు అని. మరోవైపు అమ్మేమో నేను బాగా చదివి, మంచి మార్క్స్ తెచ్చుకు ని హోర్డింగ్​లో నా ఫొటో కనపడాలి అనేది. ఒకసారి సడన్​గా ఆమెకు జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు ఆమె మాకు దూరమైంది. అమ్మ కల నేను నెరవేర్చేలోపే వెళ్లిపోయిందే అని బాధపడ్డాను. అది నా మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ ఉద్వేగం నుంచి బయటపడలేకపోయాను.

అప్పుడే డిసైడ్ అయ్యాను.. నేను యాక్టర్ అవ్వాలి అని. అమ్మ చెప్పింది చదువుకుని హోర్డింగ్​లో కనపడాలనే కానీ.. యాక్టింగ్​ను ఎంచుకోవడానికి కారణం.. మా అమ్మమ్మ, నాన్న. అప్పట్లో వాళ్లు నాటకాలు వేసేవారు. ఒకరోజు అథ్లెట్ డ్రెస్​లోనే నేరుగా పృథ్వీ థియేటర్​కి వెళ్లా. అక్కడ నాకు యాక్టింగ్ ఎవరు నేర్పిస్తారా? అని అటూ ఇటూ చూశా.  కాసేపటికి మకరంద్​ దేశ్​పాండే అనే అతను నాతో మాట్లాడారు. 

అంత ఈజీ కాదు..

స్పోర్ట్స్ నా లైఫ్​లో చాలా హెల్ప్ అయ్యాయి. నేనెప్పుడూ వదిలిపెట్టకూడదు అనే ఆలోచన అక్కడి నుంచే వచ్చింది. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకు వెళ్తూనే ఉన్నా. కొన్నిసార్లు వరుసగా 35 రోజులు షూటింగ్ చేయాల్సి వచ్చేది. సెట్స్​లోనే ఉండడం వల్ల అలసట వచ్చేది. కానీ, అథ్లెట్​ ట్రైనింగ్ నాకు ఓపికగా ఉండడం నేర్పింది. నా లోపల ఉన్న దృఢ విశ్వాసమే నన్ను ముందుకు నెట్టింది.

నిజానికి యాక్టర్ లైఫ్​ అనుకున్నంత ఈజీ కాదు. ఒక స్పోర్ట్స్​ పర్సన్​గా నాకు అయిన గాయం నయం కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ, ఒక నటిగా నేను ఆ విరామం తీసుకోవడం కుదరదు. ఎందుకంటే నాకోసం ఎంతోమంది ఆర్టిస్ట్​లు సెట్‌లోఎదురుచూస్తుంటారు. అందువల్ల నేను గాయంతోనే మిగతా షూటింగ్​లో పాల్గొన్నా. కానీ, ఆ తర్వాత నుంచి నా గురించి నేను జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టా. 

నాన్న మాట..

ఆశ్రమ్​ – 3 షూటింగ్​లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారని తెలిసింది. అది చాలా కష్టసమయం నాకు. రీల్​ లైఫ్​లో ఆ ఎమోషన్​ కాసేపే ఉంటుంది. షాట్ అయిపోగానే మళ్లీ యథాస్థితికి వచ్చేస్తాం. కానీ, రియల్​ లైఫ్​లో మాత్రం ఆ సిచ్యుయేషన్​ని బ్యాలెన్స్​ చేయడం చాలా కష్టం.

ఆశ్రమ్​ నాకు చాలా స్పెషల్​. ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయడానికి మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశాడు. నాకోసం నువ్వు తిరిగి రావొద్దు. అది నాకు సంతోషాన్నివ్వదు అని చెప్పాడు. ఆ టైంలో నాన్న చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఆయన చెప్పినట్టే ధైర్యం తెచ్చుకుని షూటింగ్ పూర్తి చేశాను. ఇదే కాదు.. నేను ఒక సిరీస్​ షూటింగ్​ చేస్తున్నప్పుడు నా కాలికి గాయమైంది. నేను దాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కంప్లీట్ చేశా. కాగా ఆశ్రమ్ సిరీస్ MX ప్లేయర్‌లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amazon MX Player (@mxplayer)

ఎన్నో నేర్చుకున్నా..

మరాఠీ, హిందీ భాషలు నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ భాషల్లో నటించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. కానీ, తమిళంలో నటించేటప్పుడు మాత్రం అది నాకు ఒక అడ్వెంచర్​లా అనిపించింది. ఎందుకంటే నాకు భాష రాదు. అక్కడి కల్చర్​ కూడా నాకు కొత్త కావడంతో దాన్ని అలవర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది.  కానీ ఈ జర్నీలో ప్రతి క్రాఫ్ట్, కల్చర్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా.