Jyothika: నీ భర్తను ఒకరోజు అప్పుగా ఇస్తావా.. జ్యోతిక సూపర్బ్ రిప్లై 

Jyothika: నీ భర్తను ఒకరోజు అప్పుగా ఇస్తావా.. జ్యోతిక సూపర్బ్ రిప్లై 

టాలీవుడ్, కోలీవుడ్ లో పదికి పైగా హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారున్నారు. అందులో ఒక చక్కని జంట ఎవరంటే..టక్కున గుర్తొచ్చేది..సూర్య (Suriya)..జ్యోతిక (Jyothika) అనే చెప్పుకోవాలి. వీరిద్దరూ నటనలోనూ, ఆహ్యార్యంలోను, సామాజిక సేవ దృక్పథంలోనూ ఆదర్శంగా నిలిచారు.

వీరి మధ్య చిగురించిన లవ్ స్టోరీ..ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, తిరిగి సినిమా సెకండ్ ఇన్నింగ్ వంటి విశేషాలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటాయి. ఎందుకంటే వీరంటే..తెలుగు కోలీవుడ్ ఫ్యాన్స్ కు అమితమైన ఇష్టం. వీరి సినిమాలు చూసిన, వీరు కలిసున్న ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ వెంటనే కామెంట్స్ చేస్తూ..ఆ ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా జ్యోతిక షేర్ చేసిన ఫొటోకు అదిరిపోయే కామెంట్ వచ్చింది. 

వివరాల్లోకి వెళితే..సూర్య అభిమాని ఒకరు ఒక అరుదైన కోరిక కోరింది. అదేంటంటే..“జ్యోతిక మేడమ్‌..సిల్లును ఒరు కాదల్‌(నువ్వు నేను ప్రేమ) సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్‌మెన్‌కు నేను చాలా పెద్ద అభిమానిని” అడగగా..దానికి జ్యోతిక రిప్లై ఇస్తూ.. ”ఉప్స్..అలాంటివేం కుదరదు” అని తనదైన శైలిలో చెప్పుకొచ్చింది.

ఇక ఈ రిప్లై చూసి మురిసి గంతేసిన ఆ అభిమాని ” ఓ మై గాడ్. మీరు నాకు రిప్లై ఇచ్చారా.? నాకు సూర్య అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు. నా పేరులో కూడా ఆయన పేరును యాడ్ చేసుకున్నా..అయినా మీ ప్రేమ ముందు నేను ఎంత..సూర్య ఎప్పటికీ మీ వాడే” అంటూ క్యూట్ గా చెప్పుకొచ్చింది. దీంతో వీరి ఇద్దరి మధ్య సాగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ :- సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు ..అరెస్ట్ అంటూ ప్రచారం..!

జ్యోతిక రీసెంట్ గా అజయ్ దేవగన్ తో నటించిన షైతాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyotika (@jyotika)