
బుల్లితెరపై స్టార్ యాంకర్ ప్రదీప్ కు స్టార్ హీరోయిన్ ప్రపోజ్ చేసింది. దానికి ప్రదీప్ పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇంతకీ ప్రదీప్ కు ప్రపోజ్ చేసిన ఆ హీరోయిన్ మరెవరో కాదు. మాళవిక నాయర్. ఆమె హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ మూవీ "అన్ని మంచి శకునములే". మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సర్కార్ షో కి హాజరయ్యారు. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి.. నందినిరెడ్డి, సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హాజరయ్యారు. షోలో మూవీ టీమ్ చేత చిత్ర విచిత్రమైన గేమ్స్ ఆడించాడు ప్రదీప్.
ఇక షో మొదలైనప్పటి నుండి మాళవిక నాయర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ప్రదీప్.. ఆమె మాట్లాడకపోతే డైరెక్టర్‌ని షాట్ చెప్పమని అడిగాడు. దానికి మాళవిక నువ్వే మాట్లాడటం లేదనడంతో సిగ్గుపడిపోయాడు. ఆ వెంటనే ఆడియెన్స్ ను `మీరు మిగిలిన వాళ్లతో మాట్లాడుతూ ఉండండి, నేను మాళవికని చూసుకుంటానని చెప్పాడు. దీంతో.. నందిని రెడ్డి.. `ప్రదీప్ నువ్వు హీరో కూడా` అని చెప్పడంతో మరింత సిగ్గుపడటం హైలైట్‌గా నిలిచింది. ఆతరువాత మాళవికతో దాగుడు మూతలు ఆడిపించాడు ప్రదీప్. దీనికి నందినిరెడ్డి రియాక్ట్ అవుతూ.. నాకు ఎందుకో ఈ మొత్తం ప్రొసీజర్‌లో ప్రదీప్ నీకు లైన్ వేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది అంది.
మాళవిక వెంటనే పక్కనే ఉన్న క్యాలీ ఫ్లవర్ తీసుకుని ప్రదీప్‌కి ప్రపోజ్ చేసింది. దీంతో ప్రదీప్ మెలికలుతిరిగిపోయాడు. మాళవిక ఇచ్చిన క్యాలీ ఫ్లవర్ తీసుకుని ఇకపై క్యాలీ ఫ్లవర్‌ని కూడా ఫ్లవర్ జాబితాలో చేర్చుతానని అన్నాడు. దీంతో షోలో నవ్వుల పువ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి.