Mrunal Thakur: 20 ఏళ్లకే పెళ్లి, పిల్లలు.. ఫ్యామిలీపై మృణాల్ షాకింగ్ కామెంట్స్

Mrunal Thakur: 20 ఏళ్లకే పెళ్లి, పిల్లలు.. ఫ్యామిలీపై మృణాల్ షాకింగ్ కామెంట్స్

సీతారామం(Sita Ramam) సక్సెస్ తో ఇండియా వైడ్ గా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్నారు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakuar). టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu raghavapudi) తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో సీత పాత్రలో జీవం పోశారు మృణాల్. సినిమాలో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అందుకే.. తెలుగు ఆడియన్స్ ఆమెను ఓన్ చేసేసుకున్నారు. ఆ సినిమా తరువాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటోంది ఈ బ్యూటీ. 

ఇటీవలే నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమా చేసిన మృణాల్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నారు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన ఫ్యామిలీ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సెలబ్రెటీగా ఉంటే ఈ ప్రపంచం మనల్ని ఇష్టపడుతుంది. ఆ గుర్తింపుతో మనం సమాజంలో మార్పు కూడా తీసుకురావచ్చు. ఆ కారణంగా కొన్ని సార్లు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో చాలా బాధేస్తుంది. అవసరమైన సమయంలో వారి పక్కన ఉండలేము. నాకు కూడా సాధారణ అమ్మాయిలా  20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, పిల్లల్నీ కని, వాళ్లతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేయాలనీ ఉంటుంది. కానీ, నాకు చావంటే భయం. నేను చనిపోతే నా ఫ్యామిలీ ఏమవుతుందో అని భయమేస్తుంది.. అంటూ చెప్పుకొచ్చింది మృణాల్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.