Rashmika Mandanna: పుష్ప 2లో శ్రీవల్లి 2.0.. ఆసక్తిరేపుతున్న రష్మిక కామెంట్స్

Rashmika Mandanna: పుష్ప 2లో శ్రీవల్లి 2.0.. ఆసక్తిరేపుతున్న రష్మిక కామెంట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ఆమె హీరోయిన్ గా వచ్చిన యానిమల్(Animal) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిని పనిలేదు. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో కనిపించిన రష్మిక తన నటనతో సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాతో విమర్శకుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకుంది రష్మిక. 

ఇక ఈ సినిమా తరువాత రష్మిక చేస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పుష్ప 2లో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది రష్మిక.

పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర గురించి యాంకర్ అడగగా.. దానికి సమాధానంగా రష్మిక మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే.. ముందు పుష్పలో శ్రీవల్లి పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఎలా ఉంటుంది? ఎలా చూపిస్తారు అని పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు పుష్ప 2లో కూడా అంతే. కానీ, ఈ సినిమాలో నా పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. పుష్ప 2లో శ్రీవల్లి 2.0ని చేస్తారు.. అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక పుష్ప 2 మూవీ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల కానుంది.