ఆ పార్టీ అధ్యక్షుడిగా హీరో నాని..మీ ఓటు మాకే

ఆ పార్టీ అధ్యక్షుడిగా హీరో నాని..మీ ఓటు మాకే

నాని (Nani) హీరోగా..శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ హాయ్ నాన్న(Hi Nanna).  నాని 30వ  సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 7 న రిలీజ్కు సిద్దమయ్యింది. ఈ మూవీ రిలీజ్ కు టైం దగ్గర పడుతుండటంతో..మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. హాయ్ నాన్న టీంతో స్పెషల్ ఇంటర్వ్యూ స్ తో పాటు..కాలేజీ స్టూడెంట్స్ ని మీట్ అవుతూ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చాలానే చేస్తున్నారు. 

ఇక లేటెస్ట్ గా నాని విభిన్నమైన ప్రమోషన్స్ చేయడానికి కొత్త పోస్టర్ దింపేసాడు. ఈ పోస్టర్ లో నాని రాజకీయ నాయకుడిలా..ఒక పార్టీ అధ్యక్షుడిలా..ఓటు కోసం ప్రచార కార్యక్రమాలు చేసే వారధిలా..కనిపిస్తున్నారు. నాని స్పెషల్ ఫోటో ను పోస్ట్ చేస్తూ..అంతా ఎన్నికల వాతావరణం నడుస్తోంది కాబట్టి..త్వరలో మా హాయ్ నాన్న డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతుంది. మీ ప్రేమ మరియు మీ అమూల్యమైన ఓటు మాకే వేయాలని కోరుతూ..మీ హాయ్ నాన్నపార్టీ అధ్యక్షుడు..విరాజ్..'అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ప్రస్తుతం తెలంగాణ లో ఎలక్షన్స్ హవా కొనసాగుతుండటంతో..హీరోస్ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం వాడుకుంటూ జోరు పెంచేస్తున్నారు. రీసెంట్ గా యాంకర్ సుమ కొడుకు లేటెస్ట్ మూవీ బబుల్గామ్ ప్రమోషన్స్ లో భాగంగా..ఒక కారులో సూట్ కేసు నిండా బబుల్గమ్స్ తో పోలీసులకి పట్టుబడినట్లుగా వీడియో షూట్ చేసి షాక్ ఇచ్చాడు.