
నేచురల్ స్టార్ నాని(Nani) తను ఎంచుకునే కథల విషయంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలా ప్రతి మూవీలను ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ.. అందరినీ తన నటనతో ఆకట్టుకుంటారు. తాజాగా నాని30 వ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మూవీకు హాయ్ నాన్న(Hi Nanna) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మూవీను శౌర్యువ్(Shouryuv) అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. రిలీజైన గ్లింప్స్ లో నాని కెమెరా పట్టుకుని వస్తుండగా..ఆగి హీరోయిన్ ను చూసే సందర్భంలో ఓ భావోద్వేగ ఫీల్ ని ఇచ్చారు డైరెక్టర్. నాని కూతురుగా నటిస్తోన్నపాపకి ఫ్రెండ్ గా మృణాల్ కనిపించడం..హాయ్ నాన్న అంటూ.. మృణాల్ థాకూర్(Mrunal Thakur), నాని కు షేక్ హ్యాండ్ ఇస్తూ పరిచయం చేసుకోవడంతో కథ ఆసక్తిగా ఉండబోతున్నట్లు అర్థం అవుతుంది. వీరి మధ్య కథనం ఎలా డిఫరెంట్ గా ఉండబోతుందో ఆసక్తి కలిగిస్తోంది ఈ గ్లింప్స్.
తండ్రి కూతుళ్ళ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుందని అర్ధం అవుతోంది. మృణాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో చిన్నారికి మృణాల్ తల్లి పాత్రలో కనిపించడం లేదనే క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఆ చిన్నారి తల్లి దూరమైన తర్వాతనే మృణాల్ పాత్ర నాని జీవితంలోకి వస్తుందని తెలిసేలా చూపించారు డైరెక్టర్.
ఇక హాయ్ నాన్న మూవీకు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హెషం అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నాడు. ఇతని మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదా..ఇదా.. ఇదే తొలిసారిలా.. పద..పదా ఏదే కుదిపానుగా..శ్వాసగా ' అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.ఇక ఈ మూవీలో సాంగ్స్ పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. హాయ్ నాన్న అనే కూల్ టైటిల్ తో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. డిసెంబర్ 21వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.