
హైదరాబాద్, వెలుగు: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) సమర్థవంతంగా అకౌంటింగ్ సేవలు, కొత్త టెక్నాలజీలను అందిస్తున్న తొమ్మిది మంది వరంగల్ ట్యాక్స్ అకౌంటింగ్ ఎక్స్పర్టులను బిజినెస్ ఆటోమేషన్ సాఫ్ట్ వేర్ ట్యాలీ సొల్యూషన్స్ సత్కరించింది.
జీఎస్టీపీలు, అకౌంటెంట్లు, ట్యాక్స్ న్యాయవాదులు, ఇతర నిపుణుల అత్యుత్తమ కృషిని గౌరవించడానికి 'ట్యాక్స్ అండ్ అకౌంటింగ్ టైటాన్స్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామని టాలీ సొల్యూషన్స్ సౌత్ జోన్ జనరల్ మేనేజర్ అనిల్ భార్గవన్ చెప్పారు. వరంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో అకౌంటింగ్ మాస్ట్రో సహా పలు ఇతర విభాగాల్లో విజేతలను గుర్తించి సత్కరించామన్నారు.