ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? అయితే ఇలా చేయండి..

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? అయితే ఇలా చేయండి..

ఎక్కిళ్లు దాదాపుగా అందరికీ కామన్ గా వచ్చే సమస్యే. కొన్ని సార్లు పెద్దవాళ్లు చిన్న షాక్ కి గురయ్యేలా ఏదో ఒకటి చెప్పి ఎక్కిళ్లు తగ్గిపోయేలా చేయటం చూస్తూనే ఉంటాం. ఒకటీ రెండు నిమిషాల పాటు వచ్చి పోయే ఎక్కిళ్లు అయితే ఏ ప్రాబ్లం లేదు. కానీ, ఒక్కోసారి విడవకుండా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. చక్కెర తిన్నా, మంచి నీళ్లు తాగినా తగ్గకుండా ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో ఆ ఎక్కిళ్లని తగ్గించుకోవచ్చు. 

ఎక్కిళ్లని తగ్గించటానికి వాడే చిట్కాలకి సైన్స్ ఆధారాలేం లేవు. కానీ వీటివల్ల ఎక్కిళ్లు తగ్గిపోవటం మాత్రం చూస్తూనే ఉంటాం.  అసలు ఎక్కిళ్లు ఎలా వస్తాయి?  ఎందుకు వస్తాయి?  

ఎక్కిళ్ల ప్రభావం గొంతు మీదే ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కిళ్లు మొదలయ్యేది మాత్రం గొంతులో కాదు.  ఊపిరితిత్తులు, పొట్ట భాగాలను వేరు చేస్తూ పక్కటెముకలను అంటిపెట్టుకుని డోమ్ షేప్‌‌‌‌లో ఒక మజిల్ ఉంటుంది. దీన్ని డయాఫ్రేమ్‌‌‌‌ అంటారు. ఇది ఒక వాల్వ్‌‌‌‌లా పని చేస్తుంది. ఊపిరి పీల్చినప్పుడు ఇది కిందికి వెళ్లి లంగ్స్‌‌‌‌లోకి గాలి వస్తుంది. మళ్లీ డయాఫ్రేమ్‌‌‌‌ పాత పొజిషన్‌‌‌‌కు వచ్చినప్పుడు నోరు, ముక్కులోంచి గాలి బయటకు వెళ్తుంది. కానీ, ఈ మజిల్ ఏదైనా కారణం వల్ల డిస్టర్బ్ అయితే ఆ గాలి స్పీడ్‌‌‌‌గా వస్తుంది (స్వరపేటిక) వాయిస్ బాక్స్‌‌‌‌కు గట్టిగా తగిలి, ఉన్నట్టుండి వోకల్ కార్డ్స్ మూసుకుపోయి జెర్క్ వస్తుంది.  ఆ జెర్క్స్ నే ఎక్కిళ్లు అంటాం.

ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?

కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం.

శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావడం.

గ్యాస్ ట్రబుల్‌‌‌‌తో పొట్ట పట్టేసినట్టు ఉన్నప్పుడు డయాఫ్రేమ్‌‌‌‌పై ఒత్తిడిపడి ఎక్కిళ్లు వచ్చే చాన్స్ ఉంది.

ఐస్, చూయింగ్ గమ్ లాంటివి తింటున్నప్పుడు గాలి శ్వాసనాళంలోకి కాకుండా కడుపులోకి వెళ్లటం.

ఫాస్ట్ గా తినటం, స్పీడ్ గా నీళ్లు తాగటం… ఇలా చాలా కారణాలుంటాయి.
ఎక్కువ స్ట్రెస్​ కి గురైనా, సడన్‌‌‌‌గా ఎమోషనల్ అయినా ఎక్కిళ్లు ఆగకుండా వస్తుంటాయి.

ఎక్కిళ్లు ఆగాలంటే

గోరు వెచ్చని నీళ్లని కొద్ది కొద్దిగా సిప్ చేయాలి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు  కూల్ డ్రింక్స్ అస్సలు ముట్టుకోవద్దు.

చిన్న అల్లంముక్క నమిలి రసాన్ని మింగాలి.

కప్పు నీటిలో చెంచాడు యాలకుల పొడి వేసి మరిగించి, చల్లారాక తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి.

పెరుగులో కాసింత ఉప్పు కలుపుకుని, మెల్లమెల్లగా తింటున్నా ఆగుతాయి.

నీళ్ల గ్లాస్ పైన టవల్ కానీ, హ్యాండ్ కర్చీఫ్ కానీ వాసెన లాగా కట్టి నీళ్లని పీల్చుకుంటున్నట్టు తాగాలి.

ఒక్క చుక్క వెనిగర్ ని నాలుక మీద వేసుకొని చప్పరించాలి.

చాతీమీద చిన్నగా మసాజ్ చేయాలి. లేదంటే కుర్చీ మీద కూర్చొని మోకాళ్ల మీదకి వంగి పొట్ట, చాతీ మీద కొద్దిగా ప్రెజర్ తేవాలి.

అయితే ఈ చిట్కాలన్నీ పాటించినా ఒక రోజుకంటే ఎక్కువ సేపు ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం లేట్ చేయకుండా డాక్టర్‌‌‌‌‌‌‌‌ని కలవాలి.

For More News..

తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్న ఇండియా

యోగా గురుకు ఫుల్ డిమాండ్.. ఆన్‌లైన్‌లో నేర్చుకొని ట్రైనర్స్‌గా మారుతున్న యూత్

మూడు నెలలుగా సౌదీలో డెడ్​బాడీ.. తెప్పించాలంటూ కుటుంబసభ్యుల వినతి