లెహెంగాల్లో డ్రగ్స్ పార్శిల్.. పట్టుకున్న NCB అధికారులు

లెహెంగాల్లో డ్రగ్స్ పార్శిల్.. పట్టుకున్న NCB అధికారులు

కర్నాటకలోని బెంగళూరు నుంచి విదేశాలకు తరలిస్తున్న డ్రగ్స్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు లెహెంగాల్లో అక్రమంగా తీసుకెళ్తున్న కోట్లాది విలువైన 3 కిలోల డ్రగ్స్‌ను ఆఫీసర్లు పట్టుకున్నారు. లెహెంగాల్లోని ఫాల్స్‌లో ఈ డ్రగ్స్‌ను దాచి తరలించేందుకు ప్లాన్ చేశారని అధికారులు గుర్తించారు. ఈ పార్శిల్‌‌ను ఆంధ్ర ప్రదేశ్‌లోని నర్సాపురం నుంచి ఆస్ట్రేలియాకు పంపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. సరుకు రవాణాదారు చెన్నైకి చెందిన వ్యక్తి అని దర్యాప్తులో తేలింది. దాంతో అతని గురించి ఈ వివరాలను చెన్నై ఎన్‌సీబీ టీమ్‌కు పంపించారు. అధికారులు వెంటనే విచారణ ప్రారంభించి రెండ్రోజుల్లో ఆ పార్శిల్‌ను పంపిన వ్యక్తి అసలు అడ్రస్ కనుక్కుని అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ పార్శిల్‌ను పంపడానికి ఆ వ్యక్తి  ఫేక్ అడ్రస్, నకిలీ డాక్యుమెంట్లను వాడినట్లు గుర్తించారు. ఈ కేసుపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

26 రోజుల్లో 19సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు

కశ్మీర్‌లో అమిత్ షా విజిట్.. 700 మంది అదుపులోకి!

తిరుపతిలో భారీ వర్షం: నీట మునిగి నవ వధువు మృతి