
గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం లెక్చరర్ల ఎంపికపై హైకోర్టు
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం లెక్చరర్ల టాలెంట్ ఆధారంగా నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫైల్ అయిన పిటిషన్లను కొట్టేసింది. టాలెంట్ బేస్డ్ గా ఆ పోస్టులను భర్తీ చేయొచ్చని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం లెక్చరర్లను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసేందుకు వీలుగా ప్రభుత్వం 2019 జూన్29న గైడ్‌లైన్స్ జారీ చేసింది. అయితే అప్పటికే పనిచేస్తున్న వాళ్లు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. హైకోర్టులో రిట్లు వేయగా, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. సింగిల్ జడ్జి ఈ ఏడాది జనవరి 29న తీర్పు ఇచ్చారు. దీనిపై పిటిషనర్లు అప్పీల్ చేశారు. ‘కాంట్రాక్టు పద్ధతిలో ఆ పోస్టులు ఉండకూడదని హైకోర్టు పలుసార్లు చెప్పింది. రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటేనే స్టూడెంట్లకు మేలు జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగాలనూ ప్రతిభ ఆధారంగా నియమించడం వల్ల విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికేమీ లేదు. అందుకే అప్పీల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నాం”డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
For More News..