
- చిన్నారిని అప్పగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: సరోగసీ పేరుతో మోసపోయిన దంపతులు బాధితులేనంటూ బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. డాక్టర్ చేసిన నేరం వల్ల వారు వేదనకు గురవుతున్నారని, వారికి శిశువును అప్పగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇతర కేసులకు వర్తించవని, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.
సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత రూ.30 లక్షలు వసూలు చేసి, శిశువుల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ కేసు నమోదు చేశారు. శిశువిహార్ సంరక్షణలోకి తీసుకున్న తమ బిడ్డను అప్పగించాలని కోరుతూ పుప్పాలగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ కేసులో పిటిషనర్ కూడా బాధితురాలేనని, అయితే అధికారుల వాదన వినకుండా ఉత్తర్వులివ్వలేమన్నారు.