AP DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..!

AP DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ పై హై కోర్ట్ కీలక ఆదేశాలిచ్చింది.  టెట్ ఎక్జామ్ కి, డీఎస్సీ ఎక్జామ్ కి మధ్య సరిపడా గ్యాప్ లేదంటూ కొంతమంది అభ్యర్థులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ఈసారి డీఎస్సీ రాస్తున్న అభ్యర్ధులకు భారీ ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.


రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం గత నెలలో టెట్, డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం టెట్ పరీక్షల నిర్వహణ తర్వాత మార్చి 14న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మార్చి 15నే డీఎస్సీ పరీక్ష నిర్వహణకు వీలుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ రెండు పరీక్షల మధ్య కేవలం ఒక్కరోజు మాత్రమే వ్యవధి ఇచ్చినట్లయింది. దీనిపై పలువురు అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రెండు పరీక్షలకు మధ్య కనీసం నాలుగు వారాలైనా గ్యాప్ ఉండాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీని ప్రకారం మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలకు వీలుగా ఇచ్చిన షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం తిరిగి డీఎస్సీ నిర్వహణకు నెల రోజుల వ్యవధితో మరో షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో టెట్ ఎక్జామ్ ముగిసిన నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ నుండి డీఎస్సీ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది.