
- హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు
వెంకటాపూర్(రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మండపంలో పట్టువస్త్రాలతో సత్కరించారు. గైడ్ ద్వారా రామప్ప చరిత్ర, విశిష్టత, శిల్పకళా నైపుణ్యం గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్ప టెంపుల్ చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆయన వెంట ములుగు జిల్లా జడ్జి సూర్య చంద్రకళ, భూపాలపల్లి జిల్లా జడ్జి దిలీప్ కుమార్, అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, సీఐలు సురేశ్, శంకర్, ఎస్సై రాజు, ఆర్ఐ విజేందర్ ఉన్నారు.