ఎమ్మెల్యే వేధిస్తుండని సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే వేధిస్తుండని సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే వేధిస్తున్నడని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన నందిపేట సర్పంచ్ వాణి అప్పు తెచ్చి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఉప సర్పంచ్, పాలక మండలి సహకరించకపోవడంతో బిల్లులు రావడంలేదని వాపోయారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మద్దతుతో పాలక మండలి ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోతున్నామని వాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పులిచ్చిన వారు డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో మనస్థాపం చెందిన భార్యాభర్తలు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు.