పొలంలో కరెంట్ వైర్లు తెగిపడి దంపతులు మృతి

పొలంలో కరెంట్ వైర్లు తెగిపడి దంపతులు మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. ధరూర్ మండలంలోని కేరేలి గ్రామంలో…. ఓ పొలంలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ఈ దారుణ ప్రమాదంలో … ఆ సమయంలో పొలంలో పనిచేస్తున్న ఇద్దరు భార్యాభర్తలు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొండాపూర్ కుర్దు గ్రామానికి చెందిన భార్యభర్తలు సుధాకర్ రెడ్డి(40), అనిత(36)  ప్రమాద సమయంలో పొలంలోనే ఉన్నారు.

స్థానికుల కథనం ప్రకారం… ఈదురుగాలులకు కరెంట్ వైర్లు పొలంలో తెగిపడ్డాయి. ఈ విషయం గుర్తించని భార్యాభర్తలు పొలంలోకి వెళ్లారు. భార్య కరెంట్ వైర్లను తాకడంతో అక్కడే కుప్పకూలిపోయింది. భార్యను విడిపించేందుకు ప్రయత్నించిన భర్తకు కూడా కరెంట్ షాక్ తగిలింది. ఇద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

విషయం తెలియడంతో గ్రామస్తులు కరెంట్ బంద్ చేశారు. దారుణ పరిస్థితుల్లో దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో.. ఐనవారు.. ఊరిలోని జనం..అందరూ కంటతడి పెట్టారు.