తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్

తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్

 

టీఎస్ లాసెట్-2024, తెలంగాణ పీజీ లాసెట్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మూడు, ఐదేళ్ల లా కోర్సు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గల ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

అర్హత :  మూడేళ్ల లా చదవాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. ఐదేళ్ల లా కోర్పు కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. పీజీ కోర్సు ఎల్ఎల్ఎంకు ఎల్ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ లేదంటే బీఎల్ చేసి ఉండాలి. జూన్ 3వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడేళ్ల లా ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐదేళ్ల లా ప్రవేశ పరీక్ష జరగనుంది. 

ఎగ్జామ్ ప్యాటర్న్ :  మొత్తం 120 మార్కుల్లో 35 శాతం (42 మార్కులు) మార్కులు సాధిస్తే క్వాలి ఫై అవుతారు. సమాచారం కోసం www.lawcet.tsche.ac.in  వెబ్​సైట్లో సంప్రదించాలి.