డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు.. ఉన్నత విద్యామండలి నిర్ణయం

డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు.. ఉన్నత విద్యామండలి నిర్ణయం

డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మూస పద్ధతికి స్వస్తి పలికి.. ఎగ్జామినేషన్, ఎవాల్యుయేషన్​, అసెస్మెంట్ లలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం రూప కల్పన బాధ్యతలను ISBకి అప్పగించింది. ఈ మేరకు ఇవాళ ISB, యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. ప్రస్తుత పద్ధతులు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. పరీక్ష విధానంలో మార్పులు విద్యార్థి హితంగా ఉండాలని నిర్ణయించారు. 

కాలేజీల్లో వసతులు పెంచాలని ఉన్నత విద్యామండలి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30లోపు రిపోర్టు ఇవ్వాలని ISBకి ఆదేశాలు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు అమలు చేయాలని చెప్పింది. పెన్ అండ్ పేపర్ విధానానికి ప్రాధాన్యత తగ్గించాలని చెప్పింది. విద్యార్థికి ఉద్యోగం వచ్చే విధంగా.. ఎంపవర్ మెంట్ సాధించే విధంగా పరీక్షా విధానం ఉండాలని నిర్ణయించింది. డిగ్రీ సిలబస్ మార్చి.. లాంగ్వేజ్‭లలోనూ ప్రాక్టికల్స్ పెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.