కాలేజీలు మూసేసినా పట్టింపు లేదా?

కాలేజీలు మూసేసినా పట్టింపు లేదా?
  • ఫీజు బకాయిలపై హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడి
  • హాజరైన ఆర్.కృష్ణయ్య    

మెహిదీపట్నం, వెలుగు: ఫీజు బకాయిల కోసం ఐదు రోజులుగా కాలేజీలు మూసివేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని రాజ్యసభ సభ్యుడు ఆర్: కృష్ణయ్య ఫైరయ్యారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్​లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ..  విద్యకు రాష్ట్ర ప్రభుత్వం 24 నెలలుగా బడ్జెట్ విడుదల చేయకుండా అన్యాయమన్నారు. 

భవనాలకు అద్దె కట్టలేక, లెక్చరర్ల జీతాలు ఇవ్వలేక కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కొన్ని కాలేజీలు అప్పుల పాలై మూత పడ్డాయని, ఈ సమస్య చిలికి చిలికి తుఫాన్ గా మారుతోందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన స్కాలర్ షిప్, ఫీజు బకాయిలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అనంతరం హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకిష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. గవ్వల భరత్ కుమార్, అనంతయ్య, రాజేందర్, అజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.