వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాలకు హైస్పీడ్ నెట్

వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాలకు హైస్పీడ్ నెట్

5జీ టెక్నాలజీని త్వరగా లాంచ్ చేయాలి

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌‌‌లో మొబైల్ టెక్నాలజీ

టెలికాంలో ఇండియాను గ్లోబల్‌‌‌‌ హబ్‌‌‌‌గా మార్చాలి

న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ను అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2020 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.5జీ టెక్నాలజీని త్వరగా ఇండియాలో లాంచ్ చేసేందుకు ఇండస్ట్రీ లీడర్లు, స్టేక్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్ అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. టెలికాం ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్, డిజైన్, డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌కు ఇండియాను గ్లోబల్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని పిలుపునిచ్చారు. ఇండియాలో టెలికాం ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేసేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రభుత్వం లాంచ్ చేసినట్టు ప్రధాని తెలిపారు.  మొబైల్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌కు మోస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌గా మన దేశం ఉందన్నారు. 5జీ టెక్నాలజీని కరెక్ట్ టైమ్‌‌‌‌‌‌‌‌కి ఇండియాలో లాంచ్ చేయడం ద్వారా లక్షలాది మంది ఇండియన్లకు సాయంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు.   మొబైల్ టెక్నాలజీతో కోట్లాది రూపాయల విలువైన ప్రయోజనాలను, లక్షలాది ఇండియన్లకు అందించవచ్చని చెప్పారు. మొబైల్ టెక్నాలజీ వల్లనే కరోనా మహమ్మారి సమయంలో నిరుపేదలకు తాము సాయం చేయగలిగామని గుర్తు చేసుకున్నారు.  కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో కూడా మొబైల్ టెక్నాలజీని వాడనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి రానున్నాయి. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో మొబైల్ టెక్నాలజీని ఎలా వాడనున్నారో పూర్తి వివరాలను మాత్రం మోడీ వెల్లడించలేదు. టెక్నాలజీ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్‌‌‌‌‌‌‌‌తో తరచూ హ్యాండ్‌‌‌‌‌‌‌‌సెట్లను, గాడ్జెట్లను మార్చే కల్చర్ మనదగ్గర ఉందని.. ఎలక్ట్రానిక్ వేస్ట్‌‌‌‌‌‌‌‌ను మెరుగైన విధంగా హ్యాండిల్ చేసేందుకు ఇండస్ట్రీ టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి ఆలోచించాలని మోడీ సూచించారు.

130 కోట్ల మంది జనాభాలో వంద కోట్ల మంది పైగా ఫోన్ వాడుతున్నారు. వీరందరికీ యునిక్ డిజిటల్ ఐడెంటిటీ ఉంది. అంతేకాక 75 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ యూజర్లున్నారు. ఇండియాలో ఇంటర్నెట్ పెనట్రేషన్ కూడా గత కొన్నేళ్ల నుంచే ఎక్కువగా ఉంది. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో సగానికి పైగా ఈ నాలుగేళ్ల కాలంలోనే ఇంటర్నెట్ ప్రపంచంలోకి వచ్చినవారు. వారిలో సగం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు.  ఇండియా డిజిటల్ సైజును ప్రస్తావించిన మోడీ.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు మనదగ్గర ఉన్నాయన్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మొబైల్ యాప్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో మనదీ ఒకటిగా ఉందని తెలిపారు. గతకొన్ని దశాబ్దాలుగా ఉన్న కంపెనీలను కూడా వెనక్కి నెట్టేసి మొబైల్ యాప్స్ వాల్యూ పెరుగుతుందన్నారు. ఇది ఇండియాకు, యంగ్ ఇన్నొవేటర్లకు చాలా మంచి తరుణమని చెప్పారు. మన యూత్ మరిన్ని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను డెవలప్ చేసేందుకు ఆసక్తి చూపనున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలను స్వాగతిస్తాం.. కానీ..

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను, ఫారిన్ ఇన్నొవేషన్లను కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని కానీ ఇదే సమయంలో మన దేశ సేఫ్టీ, సెక్యూరిటీపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని కేంద్ర ఐటీ అండ్ టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అలాగే ఇండియన్ ఇన్నొవేషన్లపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని చెప్పారు.

ప్రధాని విజన్​ బాటలో ఐఎంసీ

ఐఎంసీ 2020ను డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కోయ్) కలిసి నిర్వహిస్తున్నాయి. మంగళవారం, బుధవారం రెండు రోజులు ఈ సమిట్ జరుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్‌‌‌‌’, ‘డిజిటల్ ఇంక్లుసిటీ’, ‘సస్టైనబుల్ డెవలప్‌‌‌‌మెంట్’, ‘ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌షిప్ అండ్ ఇన్నొవేషన్’ లను ప్రమోట్ చేసే ప్రధానమంత్రి విజన్‌‌‌‌కు అనుగుణంగా ఐఎంసీ 2020 ఉంది. టెలికాం అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాలలో రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ను ప్రోత్సహించేందుకు, ఫారిన్ అండ్ లోకల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను పెంచుకునే లక్ష్యంతో ఈ సమిట్ జరుగుతోంది. ఐఎంసీ 2020లో పలువురు కేంద్ర మంత్రులు, టెలికాం, గ్లోబల్ కంపెనీల సీఈవోలు, 5జీ టెక్నాలజీ ఎక్స్‌‌‌‌పర్ట్స్, ఏఐ, ఐఓటీ, డేటా అనలటిక్స్, బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ రంగాల నిపుణులు పాల్గొంటున్నారు.

5జీ సర్వీసులు వచ్చే ఏడాది…

2021 చివరి ఆరు నెలల్లో ఇండియాలో 5జీ సర్వీసులను లాంచ్ చేయాలనే ప్లాన్‌‌‌‌లో ఉన్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. 5జీని త్వరగా ఇండియాలో ప్రవేశపెట్టేందుకు పాలసీ పరంగా కొన్ని చర్యలు అవసరమని అన్నారు. దీంతో 5జీ అఫర్డబుల్‌‌‌‌గా అందరికీ అందుబాటులోకి తేవొచ్చన్నారు. 5వ జనరేషన్ మొబైల్ నెట్‌‌‌‌వర్క్ ద్వారా ప్రతి ఒక్కరూ, ప్రతిదానితో వర్చ్యువల్‌‌‌‌గా కనెక్ట్ కావొచ్చు. దీనిలో మెషిన్లు, డివైజ్‌‌‌‌లు కూడా ఉంటాయి. దేశంలో అభివృద్ధి చేసిన నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, హార్డ్‌‌‌‌వేర్, టెక్నాలజీ కాంపోనెంట్లతోనే జియో5జీని అందిస్తుందని అంబానీ తెలిపారు.వచ్చే రెండేళ్లలో 5జీ ప్రయోజనాలను పూర్తిగా పొందేందుకు ఇండియా రెడీగా ఉందని భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ కూడా తెలిపారు. 5జీతో ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ ధరలు తగ్గుతాయని, డివైజ్‌‌‌‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. మరోవైపు ఇండియాలో 5జీ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ను నోకియా తయారు చేయడం ప్రారంభించింది. తర్వాతి తరం టెక్నాలజీని అందించడంలో తాము అడ్వాన్స్ స్టేజ్‌‌‌‌లో ఉన్నామని తెలిపింది. ఇండియాలో తొలి 5జీ న్యూ రేడియోను కూడా నోకియా తయారు చేసింది.  టారిఫ్‌‌‌‌లు, లెవీలు, స్పెక్ట్రమ్ ధరల విషయంలో సవాళ్లు ఉన్నా.. ప్రభుత్వ సపోర్ట్‌‌‌‌తో ఈ సెక్టార్ సక్సెస్ స్టోరీని రచిస్తుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది.