
ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చారణలు, మేళ తాళాల మధ్య మూలవిరాట్కు పూజలు చేశారు. తరువాత సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను ఎదుర్కోళ్ల ద్వారా కల్యాణ వేదిక దగ్గరికి తీసుకువచ్చారు. అభిజిత్ లగ్న ముహుర్తానా 11.50 నిమిషాలకు సీతారాముల కల్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే శివుని సన్నిధిలో రాములవారి కల్యాణం కోసం వచ్చిన శివపార్వతులు, జోగినీలు చేతిలో త్రిశూలంను కదిలిస్తూ శివున్ని పెళ్లాడుతున్నట్లు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ స్మరించుకున్నారు.
తెలంగాణ రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ
నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని
యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి