ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కు షాకిచ్చాడో వ్యక్తి. కాన్ బెర్రా లో హోమ్ బిల్డర్ పథకం గురించి ప్రజలకు వివరించేందుకు స్కాట్ మోరిసన్ ఓ ఇంటి ఎదుట మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం జరుగుతుండగా.. ఆ ఇంటి ఓనర్ పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంటి ఎదుట గార్డె నింగ్ లో ఉన్న గడ్డిపై మీడియా ప్రతినిధులు నిలబడి ప్రధాని స్కాట్ మోరిసన్ చెబుతున్న అంశాల్ని వింటున్నారు.
అదే సమయంలో ఆ ఇంటి ఓనర్ కోపంతో గడ్డి గింజల్ని నాటాను మీరు పక్కన నిలబడండి అరిశాడు. అంతేకాదు సీరియస్ గా మీడియా సమావేశంలో ఉన్న ప్రధానిని ..మిస్టర్ మోరిసన్ జర్నలిస్ట్ లను గడ్డి దిగి పక్కకి వెళ్లమని చెప్పండి అంటూ అరిశాడు. దీంతో ఖచ్చితంగా, ఇక్కడి నుంచి వెళతాం అంటూ పక్కకు వెళ్లే ప్రయత్నం చేశారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. దీంతో ఆ ఇంటి ఓనర్ చేతులతో సైగలు చేస్తూ ఇంట్లోకి వెళ్లాడు.
