విశాఖలో హిల్టన్ హోటల్.. కపిల్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం

విశాఖలో హిల్టన్ హోటల్.. కపిల్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం

విశాఖపట్నం: అంతర్జాతీయ  హాస్పిటాలిటీ కంపెనీ ‘హిల్టన్’ ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విశాఖపట్నంలో తన మొదటి లగ్జరీ ప్రాజెక్టును ప్రకటించింది. కపిల్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని, యెండాడలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) ప్రాంగణంలో ‘హిల్టన్ గార్డెన్ ఇన్’ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ 2032 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 

కపిల్ గ్రూప్ ఈ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనుండగా, హిల్టన్ మేనేజ్ చేస్తుంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అతిపెద్ద హిల్టన్ గార్డెన్ ఇన్ ప్రాపర్టీలలో ఇది ఒకటిగా నిలవనుంది. ఇందులో ఆల్-డే డైనింగ్ రెస్టారెంట్, లాబీ లాంజ్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్, రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్ బార్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి.

 కార్పొరేట్ సదస్సులు, సమావేశాల (ఎంఐసీఈ) కోసం సుమారు 14,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రాండ్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్, బోర్డు రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అవుట్ ప్రదేశాలను తీర్చిదిద్దుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కీలక మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భావిస్తున్న హిల్టన్, ఇప్పటికే తిరుపతి, మంత్రాలయం నగరాల్లోనూ ప్రాజెక్టులను నిర్మిస్తోంది.  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం 11 హిల్టన్ గార్డెన్ ఇన్ ప్రాపర్టీలు నడుస్తుండగా, మరో 13 హోటళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.