టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న హిందీ ‘ఛత్రపతి’

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న హిందీ ‘ఛత్రపతి’

పొరుగు భాషల కథలను మన హీరోలు రీమేక్‌‌‌‌ చేయడం కామన్. కానీ ఇక్కడి కథనే హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రాజమౌళి, ప్రభాస్ కాంబోలో  పదిహేడేళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ రీమేక్‌‌‌‌తో బాలీవుడ్‌‌‌‌ ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి.వినాయక్ డైరెక్షన్‌‌‌‌లో లాస్ట్ ఇయర్ జూలైలో షూటింగ్ స్టార్ట్  చేసి.. హైదరాబాద్, విశాఖపట్నంలో కొన్ని షెడ్యూల్స్ షూట్ చేశారు. టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసినట్టు నిన్న ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమాలోని పాత్ర కోసం సాయి శ్రీనివాస్‌‌‌‌ ఫిజికల్‌‌‌‌గా ఎంతో మేకోవర్ అయ్యాడని,  ఆ లుక్‌‌‌‌ను త్వరలో ప్రేక్షకులు చూడబోతున్నారంటూ ఊరిస్తున్నారు మేకర్స్. సాహిల్ వాయిడ్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివమ్ పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్ లాంటి పలువురు బాలీవుడ్ యాక్టర్స్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై జయంతీలాల్‌‌‌‌ గడ నిర్మిస్తున్నారు. మయూర్ పూరి మాటలు రాస్తున్నారు. తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నాడు. అన‌‌‌‌ల్‌‌‌‌ అర‌‌‌‌సు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.  సమ్మర్‌‌‌‌‌‌‌‌కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.