అల్లు అర్జున్ కు బాలీవుడ్ హీరో డబ్బింగ్

అల్లు అర్జున్ కు బాలీవుడ్ హీరో డబ్బింగ్

ముంబై: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1 ట్రైలర్ తాజాగా విడుదలై నెట్టింట సందడి చేస్తోంది. అల్లు అర్జున్ మాస్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో హిందీ ఆడియన్స్ నూ పలకరించేందుకు బన్నీ సిద్ధమవుతున్నాడు. పుష్ప హిందీ డబ్బింగ్ వెర్షన్ లో బన్నీ పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే గాత్రం అందించాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మోస్ట్ పవర్ ఫుల్, స్టయిలిష్ స్టార్ కు వాయిస్ అందించడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. లయన్ కింగ్ తర్వాత తనకు ఇది రెండో డబ్బింగ్ చిత్రమన్నాడు. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కు తన సొంతశైలిలో డబ్బింగ్ చెప్పి న్యాయం చేసేందుకు ప్రయత్నించానని తల్పడే ఇన్ స్టా పోస్టులో పేర్కొన్నాడు. ఝుకేగా నై (తగ్గేదే లే) అంటూ ముగించాడు. పుష్ప ది రైజ్ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాగా, శ్రేయాస్ తల్పడే పలు హిందీ సినిమాలతోపాటు మరాఠీ మూవీల్లోనూ నటించాడు. డోర్, ఇక్బాల్ లాంటి మూవీల్లో హీరోగా నటించిన ఆయనలో మంచి కమెడియన్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్స్ ఓం శాంతి ఓం, గోల్ మాల్ రిటర్న్స్, గోల్ మాల్ 3, హౌస్ ఫుల్ 2తోపాటు గోల్ మాల్ అగెయిన్ సినిమాల్లో కామెడీ టైమింగ్ తో తల్పడే మంచి పేరు సంపాదించాడు.