ఏసీల వ్యాపారంలోకి హైసెన్స్​

ఏసీల వ్యాపారంలోకి హైసెన్స్​

హైదరాబాద్​, వెలుగు :  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్​ హైసెన్స్ కూలింగ్ ఎక్స్‌‌‌‌పర్ట్ ప్రో ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అధిక ఫ్యాన్ స్పీడ్, 4- ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్‌‌‌‌, ఇంటెలిజెంట్ ఇన్వర్టర్, వేగంగా చల్లదనం ఇవ్వడం, కరెంటు పొదుపు వీటి ప్రత్యేకతలు. కరెంటు పొదుపు కోసం వేరియబుల్ టోనేజ్ టెక్నాలజీ ఉంటుందని హైసెన్స్​తెలిపింది.  ధరలు రూ. 27,990 నుంచి మొదలవుతాయి. ఈ ప్రొడక్టులపై సంవత్సరం పూర్తి వారంటీ, కంప్రెసర్​పై 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది.