- 16 వరకు రిజిస్ట్రేషన్ గడువు
హైదరాబాద్, వెలుగు: మూడు జిల్లాల్లో ల్యాండ్స్ అమ్మకానికి సంబంధించి బుధవారం నుంచి హెచ్‌ఎండీఏ ప్రీ బిడ్ మీటింగ్‌లు నిర్వహించనుంది. రంగారెడ్డి , సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 38 చోట్ల ల్యాండ్స్ అమ్మకానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు గడువు విధించింది.
18న ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించనుంది. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లాలోని 17 ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్స్‌కు బేగంపేట టూరిజం ప్లాజాలో, 5న సంగారెడ్డి జిల్లాలో 17 చోట్ల ఉన్న ల్యాండ్స్‌కు రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో, 6న మేడ్చల్ జిల్లాలోని 8 ప్రాంతాల్లోఉన్న ల్యాండ్స్‌కు బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రీ బిడ్ మీటింగ్ ఉంటుందని సోమవారం హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ మీటింగ్‌లో రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు హాజరై ల్యాండ్ వివరాలు, కొనుగోలుదారుల సందేహాలను తీర్చనున్నారని పేర్కొంది.