జైపూర్, వెలుగు: కౌన్సిలింగ్ పేరుతో కార్మికులను అవమానిస్తున్నారని హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు. సంఘం నేత ఎర్రంశెట్టి సాయికుమార్ ఆధ్వర్యంలో గురువారం జైపూర్ మండలంలోని ఇందారం ఐకే 1ఏ గని పై సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నాగాల పేరుతో కార్మికులకు కౌన్సిలింగ్ పేరిట అవమానించడాన్ని మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 150 నుంచి 200 కు పైగా డ్యూటీలు చేసిన కార్మికులను కేవలం అక్టోబర్ నెలలో 16 మస్టర్లు చేయలేదనే నెపంతో ఎంక్వయిరీ పేరిట కౌన్సిలింగ్ నిర్వహించడం సరికాదన్నారు. వెంటనే సింగరేణి యాజమాన్యం కౌన్సిలింగులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
