
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అనుబంధ ఆలయమైన పాతగుట్టలో జరుగుతున్న పవిత్రోత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా కలశ ఆవాహనం, సుదర్శన హోమం, జితంతే హవనం, అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు శాస్తబద్దంగా నిర్వహించారు. పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం స్వర్ణ దివ్యవిమాన గోపురంపై ఉన్న శిఖరానికి షోడశోపచార పూజలు చేశారు. అనంతరం పవిత్రమాలలకు ప్రత్యేక పూజలు చేసి స్వామి, అమ్మవార్లకు ధరింపజేశారు. ఏడాది కాలంగా ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజలు, నిత్య కైంకర్యాల్లో తెలిసీతెలియక చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.