ఇంట్లోనే స్పా

ఇంట్లోనే స్పా

రిలాక్స్​ అవ్వడానికి చాలామంది స్పాకి వెళ్తుంటారు. వీకెండ్స్​లో వెళ్తూ బాడీ, మైండ్​ని రిలాక్స్​ చేసుకుంటారు. అయితే ఈ కరోనా భయంతో బయట స్పాలు తెరిచి ఉన్నా, అక్కడికి వెళ్లేందుకు మాత్రం   ఇంకా భయపడుతున్నారు. కానీ, స్పాకి వెళ్లాలనిపిస్తుంది.  అలాంటి వాళ్లు పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండానే.. తమ ఇంటి బాత్​రూమ్​ని స్పాగా మార్చుకోవచ్చు.

అరోమా థెరపీ ఆయిల్స్​

బయట స్పాలోకి అడుగుపెట్టగానే, ఒకరకమైన  సువాసన మనసును తేలికపరుస్తుంది. అందువల్ల ఇంటి బాత్​రూమ్​లో డిఫ్యూజర్​ని పెట్టుకోవాలి. అలాగే లావెండర్​, హెంప్​ సీడ్​, రోజ్​, యూకలిప్టస్, స్ట్రాబెర్రీ వంటి అరోమా థెరపీ ఆయిల్స్​ తెచ్చుకోవాలి. కావాల్సినప్పుడల్లా నాలుగైదు చుక్కలు ఈ అరోమాథెరపీ ఆయిల్​ని డిఫ్యూజర్​లో వేయాలి. వీటివల్ల వచ్చే సువాసన అలసిన శరీరానికి, మనసుకు రిలాక్సేషన్​ అందిస్తుంది.

బాత్​ టబ్​

స్పా ఎక్స్​పీరియెన్స్​ కావాలంటే బాత్​రూమ్​లో.. బాత్​ టబ్​ను తెచ్చిపెట్టుకోవాలి. అలాగే టబ్​ వాటర్​లో నచ్చిన పూరేకులను వేసుకోవచ్చు. అలాగే చల్ల నీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లు పోసుకుని, ఆ టబ్​లో కాసేపు రిలాక్స్​ అవ్వచ్చు.

ఇండోర్​ ప్లాంట్స్​

బాత్​రూమ్​ రెగ్యులర్​గా కాకుండా కాస్తంత స్పెషల్​గా కనిపించాలంటే.. రెండు, మూడు చిన్నసైజు టేబుల్ ప్లాంట్స్​ పెట్టుకోవాలి. ఈమధ్య ఇంటీరియర్ డెకరేషన్​లో ఇండోర్​ ప్లాంట్స్​పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలా బాత్​రూమ్​లో కూడా సువాసన వెదజల్లే, లేదా అందంగా కనిపించే మొక్కల కుండీలు పెట్టుకుంటే స్పా ఎక్స్​పీరియెన్స్​ కలుగుతుంది.

బాత్​ బామ్స్​?​

స్పా ఫీలింగ్​తో పాటు బాడీ, స్కిన్​కి మంచి రిలాక్సేషన్​ కావాలంటే బాత్​ బాంబ్స్​ బెస్ట్ ఆప్షన్. వీటిని నీళ్లలో వేయగానే కరిగిపోతాయి. అప్పుడు దాంట్లోంచి సిట్రిక్ యాసిడ్​ రిలీజై చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. అలాగే అందులోని హైడ్రేటింగ్​ ఆయిల్స్​ చర్మాన్ని మాయిశ్చరైజ్​ చేస్తాయి. నీళ్లు కలర్​ఫుల్​గా మారడంవల్ల చాలామంది దాన్ని ఎంజాయ్​ చేస్తారు.

క్యాండిల్స్​

బాత్​రూమ్​కి స్పా లుక్​ తెచ్చేందుకు ఈ క్యాండిల్స్​ బాగా ఉపయోగపడతాయి. బాత్​రూమ్​లో రెగ్యులర్​గా వాడే బల్బ్​​కి బదులు చిన్నిచిన్న క్యాండిల్స్​ పెడితే.. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. పైగా రెగ్యులర్​గా వాడే ఎల్​ఈడీ, ఇన్​క్యాండిసెంట్​ బల్బులు కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి క్యాండిల్స్​ ఆవిధంగానూ మంచి చేస్తాయి.