మహబూబ్‌నగర్ అర్బన్/వనపర్తి/గద్వాల/ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: హోంగార్డ్స్ సొసైటీకి రక్షణ కవచంగా నిలుస్తున్నారని ఎస్పీలు తెలిపారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌లో శనివారం హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఎస్పీలు డి.జానకి, సునీత రెడ్డి, శ్రీనివాస్‌రావు, నాగర్‌కర్నూల్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలను కొనియాడారు.
