హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో షురూ

 హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో షురూ
  • ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

హైదరాబాద్:  అన్ని వర్గాల వారికి అనువైన రెసిడెన్షియల్​ ప్రాపర్టీని అందించేందుకు టైమ్స్​ఏర్పాటు చేసిన ‘హోమ్ హంట్ ఎక్స్‌‌‌‌పో’ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఇందులో 40 మంది ప్రముఖ బిల్డర్స్, 100కి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి పై ఫోకస్ పెడతామని అన్నారు. 

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి అనువైనదని స్పష్టం చేసింది. అమరావతిని హైదరాబాద్ తో పోల్చితే హైదరాబాద్ స్థానం హైదరాబాద్​కే ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.  ఆర్ఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో డెవలప్​మెంట్​, మూసీ డెవలప్​మెంట్​పై సీఎం ఫోకస్ చేశారని పొంగులేటి వివరించారు. అమరావతి రాజధాని అయినా హైదరాబాద్​కు వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ఆదిభట్లలో అతి త్వరలో ఫాక్స్కా న్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు.