మైనార్టీలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలే : మహమూద్ అలీ

మైనార్టీలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలే : మహమూద్ అలీ

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముస్లింలకు మంచి రోజులు వచ్చాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలు మైనార్టీలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులకు షాదీ ముబారక్ ఇచ్చి పేదలను ఆర్థికంగా కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎంతోమంది పేద ముస్లిం పిల్లల చదువుల కోసం లక్షలు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 

రాష్ట్రంలో బక్రీద్ రోజున ముస్లిం ఆడ పడుచులకు చీరలు పంపిణి చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి.. సునీతా లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. తనను డిప్యూటీ సీఎం, హోం మంత్రిని చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు.

ALSO READ :- జనసేనతో బీజేపీకి కుదిరిన పొత్తు.. 11 స్థానాలు కేటాయింపు!