దేశమంతటా హై అలర్ట్ : ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు

దేశమంతటా హై అలర్ట్ : ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు

జమ్ముకశ్మీర్ రాష్ట్ర పునర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాలతో కేంద్రం అలర్టైంది. నిఘా వర్గాల సమాచారంతో దేశమంతటా హై అలర్ట్ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్న కేంద్ర హోంశాఖ.. తాజా సమాచారంతో మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల పోలీస్ శాఖలకు సూచనలు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవానికి మరో వారం రోజులే ఉండటంతో… ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలను హై అలర్ట్ చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర బందోబస్తు,తనిఖీలకు ఆదేశాలు ఇచ్చింది. దేశమంతటా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు బందోబస్తు సమాచారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాల పోలీసులకు కేంద్రం ఆదేశించింది.

మరోవైపు.. జమ్ముకశ్మీర్ లో తీసుకున్న ముందస్తు బందోబస్తు చర్యలతో ఆ రాష్ట్రంలో ప్రశాంతత కనిపిస్తోంది. ఐతే… భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని.. అల్లరిమూకలకు అవకాశం ఇవ్వొద్దని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. జమ్మూకాశ్మీర్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రతి కిలోమీటర్ కు ఒక CRPF క్యాంపు ఏర్పాటుచేసింది.