వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించిన నిరాశ్రయుడు

వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించిన నిరాశ్రయుడు

కొన్నిసార్లు డబ్బు లేకపోయినా.. సాయం చేయాలన్న ఆలోచన ఉంట్ చాలనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎంత సంపాదించామా.. ఎంత ఎంజాయ్ చేశామా.. మన వాళ్ల కోసం ఎంత కూడబెట్టామా అని చూసే వాళ్లే తప్ప.. కష్టాల్లో ఉన్న వాళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఒకవేళ చూసినా నాకేందుకే అని చూసీ, చూడనట్టు పట్టించుకోని దుస్థితి. మనిషికి మనిషి సాయం చేసుకోవాలి అంటారు గానీ.. అది నిరూపితమయ్యేది చాలా తక్కువ సందర్భాల్లోనే. మనిషి విషయంలోనే ఇలా ఉంటే.. మరి జంతువుల పరిస్థితి ఏంటి... చూసి చేరదీసి, ఆశ్రయం కల్పించేవాళ్ల కంటే.. ఛీ కొట్టి వెళ్లే వాళ్లే ఎక్కువ. అలాంటి ఈ రోజుల్లో ఓ వ్యక్తి వీధి కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఆశ్రయం కల్పిస్తున్నాడు అంటే.. అతనేదో మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకుంటారేమో.. కానీ అదేం కాదు. ఆ వ్యక్తి కూడా ఓ నిరాశ్రయుడే. అయినా తనకున్న దాంట్లోనే తోచిన మేరకు వీధి కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్న ఓ ఫొటో అందర్నీ ఆలోచింపజేసేదిగా ఉంది.

ఈ ఫొటోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా షేర్ చేశాడు. ఈ పిక్ లో ఓ వ్యక్తి, అతని పక్కనే పడుకొని ఉన్న కొన్ని కుక్కలు పడుకొని ఉన్నాయి. వాటికి ఆశ్రయంగా ఆ వ్యక్తి ఓ గొడుగును కూడా అడ్డుగా పెట్టాడు. అయితే ఈ ఫొటోను షేర్ చేసిన సుశాంత.. ఈ పెద్ద ప్రపంచంలో మన మనసు కూడా పెద్దదిగా ఉంటే చాలు అనే క్యాప్షన్ ను జత చేశాడు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టును చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఆ వ్యక్తి మనసును మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. మరికొందరేమో వావ్ వాట్ ఏ మ్యాన్ అని, 24 క్యారెట్ గోల్డ్ హార్ట్ అంటూ కామెంట్ చేస్తు్న్నారు.