న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హువావే తన హానర్ బ్రాండ్ ల్యాప్ టాప్స్ ను ఇండియా మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. హానర్ మ్యాజిక్ బుక్ 15 పేరుతో విడుదలైన ఈ అల్ట్రాబుక్ విండోస్ 10 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇందులో ఫుల్ హెచ్ డీ డిస్లే, ఏఎండీ రైజెన్ 3000 సిరీస్ సీపీయూలు, వేగా గ్రాఫిక్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వచ్చే నెల నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు మొదలవుతాయి. హానర్ మ్యాజిక్ బుక్ 15 ధర 42,990 రూపాయలు. ప్రారంభ ఆఫర్ గా 3000 తగ్గింపుతో రూ. 39,990 రూపాయలకే ఇస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ 256జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ ఉండటం వల్ల లాయ్ప్ టాప్ వేగంగా పనిచేస్తుంది. టైప్సీ పోర్ , 65 వాట్స్ చార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం రీచార్జ్ అవుతుంది.

