
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసినందుకే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి చైనా దాడులకు దిగుతోందని అన్నారు. 370 రద్దును ఆ దేశం ఒప్పుకోలేదని, డ్రాగన్ కంట్రీ మద్దతుతో ఆ ఆర్టికల్ మళ్లీ అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఓ న్యూస్ చానల్‌కు ఇంటర్వూ ఇచ్చిన ఫరూఖ్.. ‘చైనా ప్రెసిడెంట్‌ను నేనెప్పుడూ ఆహ్వానించలేదు. ప్రధాని మోడీనే ఆయన్ను పిలిచారు. ఊయలపై కూర్చోబెట్టారు. చెన్నైకి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు’ అని గుర్తుచేశారు. 2019 ఆగస్టు 5న జమ్మూ-కాశ్మీర్‌ను విభజించిందని, ఆర్టికల్ 370ని రద్దు చేసిందని, అది యాక్సెప్టబుల్ కాదని అన్నారు.