- జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ వెంకటేశం
అచ్చంపేట, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో కూరగాయలు, పండ్ల తోటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించి పంటలను కాపాడుకోవాలని జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ వెంకటేశం సూచించారు. మంగళవారం అచ్చంపేట డివిజన్లోని వివిధ గ్రామాల్లో మిరప, కూరగాయలు, పూల తోటలను ఆయన పరిశీలించారు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయలు, పండ్ల తోటల పెంపకంలో నష్టాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. డివిజన్ హార్టికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు.
