సిత్రాంగ్ తుఫాన్ : ఏపీకి తప్పిన ముప్పు

సిత్రాంగ్ తుఫాన్ : ఏపీకి తప్పిన ముప్పు

సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ బీభత్సానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాక్స్ బజార్ తీరం నుంచి వేల మందిని పునారావాస కేంద్రాలకు తరలించారు. 576 షెల్టర్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే విద్యాసంస్థలనూ పునారావాస కేంద్రాలుగా మారుస్తామని కాక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ రషీద్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సిత్రాంగ్ తుఫాన్ ఇవాళ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీన్ని ప్రభావంతో రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిత్రాంగ్ ముప్పు ఏపీపై లేనప్పటికీ చలి తీవ్రత మాత్రం పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోనూ చలి తీవ్రత పెరిగింది.