గోపన్న గూడెం గ్రామంలో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

 గోపన్న గూడెం గ్రామంలో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

అశ్వారావుపేట, వెలుగు :  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గోపన్న గూడెం గ్రామంలో  గంగరాజు ఇంట్లో సోమవారం విద్యుత్ మీటర్ వద్ద మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఇంటిని మొత్తాన్ని మంటలు చుట్టుముట్టటంతో కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

 గ్రామస్తులు చేరుకొని మంటలను అదుపు చేసే లోపే ఇల్లు అగ్నికి ఆహుతై పోయింది. బాధిత కుటుంబం కట్టుబట్టలతో రోడ్డుపై మిగిలారు. ఇంట్లో సామగ్రి, బీరువాలో దాచిన రూ. లక్ష నగదు. ఎలక్ట్రానిక్ పరికరాలు, తినడానికి దాచుకున్న పది బస్తాల ధాన్యం పూర్తిగా కాలిపోయాయని బాధితులు విలపించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.