అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం.. 255 మంది మృతి!

అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం.. 255 మంది మృతి!

అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.1గా నమోదైంది. నిన్న రాత్రి వచ్చిన భూకంపంతో 255 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు అంటున్నారు. మరో 150 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. గాయపడ్డ వారికి హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. తెల్లవారుజామున భూకంపం రావడంతో నిద్రలోనే చాలా మంది చనిపోయారు. ఇండ్ల పైకప్పులు కూలడంతో మృతుల సంఖ్య పెరిగిందంటున్నారు. పక్టికా ప్రావిన్స్ భూకంప కేంద్రంగా ఉంది. బర్మాలా, జిరుక్, నాకా, గయన్ జిల్లాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది.